Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేస్‌వెల్ అరుదైన ఘనత: తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్

Webdunia
గురువారం, 21 జులై 2022 (16:12 IST)
Michael Bracewell
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు.
 
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన బ్రేస్‌వెల్ ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన బ్రేస్‌వెల్.. మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుస వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
కాగా తన టీ20 కెరీర్‌లో ఇదే అతడికి తొలి ఓవర్‌. మూడో బంతికి మార్క్‌ అడైర్‌ బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగగా.. నాలుగో బంతికి మెక్‌ గ్రాతీ, ఐదో బంతికి క్రెగ్‌ యంగ్‌ పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 బంతులే వేసిన అతడు ఐదు పరుగులతో పాటు మూడు వికెట్లు సాధించాడు. 
 
తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో న్యూజిలాండ్‌ బౌలర్‌గా బ్రేస్‌వెల్‌ నిలిచాడు. అంతకుమందు జాకబ్‌ ఓరమ్‌,టిమ్‌ సౌథీ ఈ ఘనత సాధించారు.
 
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌ను 88 పరుగుల తేడాతో కివీస్‌ చిత్తు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 91 పరుగులకే కుప్పకూలింది.  
 
ఐర్లాండ్‌ బ్యాటర్లలో మార్క్ అడైర్ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ క్లీవర్‌ 78 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

గడ్డం, మీసంతో కనిపించిన అఘోరీ.. చేతిలో నిమ్మకాయలు.. ఏం చేస్తోంది..? (video)

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments