మహేంద్రుడి రికార్డు బద్ధలు.. సిక్సర్ల రారాజు రోహిత్

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (12:07 IST)
స్వదేశంలో జరుగుతున్న ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) పోటీల్లో భాగంగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఈ క్ర‌మంలో అత‌డు చెన్నై సూప‌ర్‌కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెన‌క్కి నెట్టాడు. 
 
స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలుసు క‌దా. అందులో అత‌డు రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ మొత్తం సిక్స‌ర్ల సంఖ్య 217కు చేరింది.
 
ఇన్నాళ్లూ ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా ధోనీ (216) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ చెరిపేశాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స్‌లు బాదింది క్రిస్ గేల్ (351) కాగా, ఏబీ డివిలియ‌ర్స్ (237) త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. 
 
ఇక ధోనీ, రోహిత్ త‌ర్వాత విరాట్ కోహ్లి (201) ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా టీ20ల్లో 4 వేల ప‌రుగుల రికార్డును కూడా ఇదే మ్యాచ్‌తో రోహిత్ అందుకున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అమరావతిలో నాలుగు స్టార్ హోటళ్లు : కొత్త టూరిజం పాలసీ

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments