Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రావణాసురుడిచే విరచితమైన శివతాండవ స్తోత్రమును రోజూ పఠిస్తే..?

రావణాసురుడిచే విరచితమైన శివతాండవ స్తోత్రమును రోజూ పఠిస్తే..?
, శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:44 IST)
Lord Shiva
శివతాండవ స్తోత్రము రావణాసురుడిచే విరచించబడిన శివస్తోత్రం. రావణాసురుడు బల గర్వముతో పార్వతితో కూడి ఉన్న శివుడు నివాసమైన కైలాస పర్వతాన్ని పెకిలిస్తుండగా శివుడు ఉగ్రుడై వచ్చినప్పుడు శివుని శాంతింపజేయడానికి శివుని స్తుతిస్తూ సామవేద పూరితంగా శబ్ధాలంకారాలతో కూడినదే శివస్తోత్రము. 
 
ఈ స్త్రోతాన్ని ప్రదోషం పూట, శివరాత్రి పూట.. లేదా రోజూ ప్రదోష కాలంలో పఠిస్తే.. సర్వదోషాలు తొలగిపోతాయి. సమస్త ఐశ్వర్యాలు చేకూరుతాయి. ప్రదోషకాలమున శివపూజా పరిసమాప్తియందు ఎవడీ శివార్చనాపరమైన రావణకృతమైన స్తుతిని పఠించునో వానికి శివానుగ్రహముచే రథగజతురంగములతో సదా సుప్రసన్నయైన స్థిరసంపదలు సిద్ధించునని పండితుల వాక్కు. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనస్సులో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈతిబాధలు తొలగిపోతాయి . 
 
మీరు ప్రతిరోజూ దీనిని పఠిస్తే అగ్నిదేవుని అనుగ్రహం లభిస్తుంది. తెలియకుండా మంటను తాకినా ఇబ్బందులు తప్పవు. అలాంటిది ఆయనచే ఏర్పడే ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడే రక్ష లభిస్తుంది. అన్ని బాధలను తొలగించడానికి శివ తాండవ స్తోత్రం దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17-04-2021 శనివారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేస్తే...