Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలియుగంలో శివపురాణం పారాయణ చేస్తే..?

కలియుగంలో శివపురాణం పారాయణ చేస్తే..?
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:24 IST)
కలియుగంలో సులభమైన పద్ధతుల ద్వారా దేవరుల అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనక్కర్లేదని.. నిష్ఠతో పది నిమిషాల ధ్యానం చేసి స్వామిని స్తుతిస్తే వారి ఖాతాలో కొన్ని జన్మల పుణ్యం చేరుతుందని వారు చెప్తున్నారు. అలా కొన్ని శ్లోకాలను పఠించడం ద్వారా దైవానుగ్రహం సులభంగా లభిస్తుందని వారు అంటున్నారు. అందులో ఒకటి శివపురాణం. 
 
కలియుగంలో శివ పురాణం చదవడం వల్ల త్వరితగతిన పాప విముక్తులు అవుతారు. దాంతో పాటు సకల ఐశ్వర్యవంతులుగా మారుతారని శివ పురాణం చెబుతోంది. అంతే కాదు శివ పురాణాన్ని అనుసరించడం వల్ల లేదా వినడం వల్ల పారాయణ చేయడం వల్ల శివానుగ్రహం తప్పకుండా ఉంటుంది. శివ ఆరాధనకు మించిన తరుణోపాయం ఏమి లేదని, పాపాలు పోగొట్టుకోవడానికి ఇదే మంచి మార్గమని సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే స్వయంగా చెప్పారు.
 
మంచి భార్య కావాలన్నా, యోగ్యుడైన భర్త కావాలన్నా , మంచి సంతానం కావాలన్నా, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, మోక్షం పొందాలనుకున్న శివుడిని ఆరాధించడమే మంచి మార్గమని విష్ణువు బ్రహ్మకు ఉపదేశించారు. కాబట్టి కలియుగంలో మనం కూడా ఈ పురాణాన్ని చదవడం చేస్తే అనుకున్న కార్యాల్లో విజయంతో పాటు పాపవిముక్తులమై.. మోక్ష మార్గాన్ని ఎంచుకున్నట్లవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-04-2021 నుంచి 17-04-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు