Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ-జడేజా అవుట్.. ఆపద్భాంధవుడు ఆదుకోలేదు..

Webdunia
బుధవారం, 10 జులై 2019 (19:20 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టును ఆదుకున్నాడు. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి సెమీఫైన‌ల్‌లో పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన భార‌త జ‌ట్టును ఆదుకునే ఏకైక ఆప‌ద్బాంధ‌వుడిగా మ‌హేంద్ర‌సింగ్ ధోనీని భావిస్తున్న ఫ్యాన్స్.. ఆయ‌న‌ను శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడిగా చిత్రీక‌రిస్తున్నారు. 
 
మ‌రికొంద‌రు ధోనీని బాహుబ‌లిగా కీర్తిస్తున్నారు. ప్ర‌స్తుతం ధోనీ, ర‌వీంద్ర జ‌డేజా క్రీజులో ఉన్నారు. టీమిండియా 47 ఓవర్లకు భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. అంతకుముందు జడేజా (52) అర్ధశతకం అందుకున్నాడు. నీషమ్‌ బౌలింగ్‌లో ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టి జడేజా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 
 
స్కోరు బోర్డును జడేజా, ధోనీ కదిలిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో- క్రికెట్ బ్యాట్‌ను వేణువులా ప‌ట్టుకుని డ్రెస్సింగ్‌రూమ్‌లో క‌నిపించిన ధోనీ ఫొటోను పిల్ల‌నగ్రోవిని ఊదుతున్న శ్రీకృష్ణుడిలా చిత్రీక‌రించారు. మెమెల‌ను ఎడ‌తెరిపి లేకుండా సంధిస్తున్నారు. కానీ అనూహ్యంగా జడేజా అవుట్ అయ్యాడు. కీలక సమయంలో టీమిండియా కీలక వికెట్‌ పోగొట్టుకుంది. 
 
బౌల్ట్‌ వేసిన 47.5 బంతిని భారీ షాట్‌ ఆడబోయి రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4×4, 4×6) ఔటయ్యాడు. విలియమ్సన్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. కానీ ధోనీ ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. 48.3 ఓవర్ల వద్ద ధోనీ రనౌట్ అయ్యాడు. 71 బంతుల్లో ధోనీ 49 పరుగులు సాధించాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments