Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చెత్త రికార్డు.. కోహ్లీకి కొత్తేమీ కాదు.. షమీని పక్కనబెట్టారని? (video)

Webdunia
బుధవారం, 10 జులై 2019 (18:36 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్‌లో భారత్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. గట్టి ఫామ్‌లో వున్న టీమిండియా జట్టుకు న్యూజిలాండ్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. కివీస్‌ను తక్కువగా అంచనా వేయొద్దని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముందుగా హెచ్చరించిన నేపథ్యంలో... భారత్ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించినా బ్యాటింగ్‌లో మాత్రం చెత్త రికార్డును నమోదు చేసుకుంది. 
 
కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 24 పరుగులకే భారత్ కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో పరుగులు చేయడానికి భారత్ బ్యాట్స్‌మన్‌ అష్టకష్టాలు పడుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లు మ్యాట్‌ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్‌లు నిప్పులు చెరిగే బంతులేశారు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది.
 
కేవలం 24 పరుగులు మాత్రమే చేయడంతో ఈ ప్రపంచకప్‌లో పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా భారత్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇదే మ్యాచ్‌లో కివీస్ 27 పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఇక లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై భారత్‌ చేసిన 28 పరుగులు పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు కాగా.. కివీస్ దాన్ని సవరించి చెత్త గణాంకాలను నమోదు చేసింది. ఇక బంగ్లాపై పాక్ 31 పరుగులు చేసింది. 
 
ఇకపోతే.. కెప్టెన్ విరాట్ కోహ్లీపై అప్పుడే విమర్శలు మొదలైయ్యాయి. విరాట్ కోహ్లీ.. కీల‌క మ్యాచుల్లో తేలిపోతున్నాడని, తడ‌బ‌డుతున్నాడని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్ర‌త్యేకించి- ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నాకౌట్ మ్యాచ్‌లంటే విరాట్ కోహ్లీ ఎందుకో ఒత్తిడికి గుర‌వుతున్నాడ‌నే విష‌యం ఇక్క‌డ మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది. ప్ర‌పంచ‌క‌ప్ తొలి సెమీ ఫైన‌ల్‌లో కోహ్లీ ఆరు బంతుల‌ను ఎదుర్కొని ఒకే ఒక్క ప‌రుగు చేశాడు. అంతే పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. త‌న బ్యాచ్‌మేట్ ట్రెంట్ బౌల్ట్ చేతిలో ఎల్‌బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు.
 
ప్ర‌పంచ‌క‌ప్ నాకౌట్ లేదా సెమీఫైన‌ల్ మ్యాచుల్లో విఫ‌లం కావ‌డం విరాట్ కోహ్లీకి కొత్తేమీ కాదు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ తొలి సెమీఫైన‌ల్‌ను క‌లుపుకొని ఇప్ప‌టిదాకా విరాట్ కోహ్లీ ఆరు నాకౌట్ మ్యాచ్‌ల‌ను ఆడాడు. ఈ ఆరింట్లో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ భారీ స్కోరును న‌మోదు చేయ‌లేదు. ఈ ఆరు మ్యాచుల్లో అత‌ని అత్య‌ధిక స్కోరు 35 మాత్ర‌మే. 49 బంతుల్లో 35 ప‌రుగులు చేశాడు. ఆరు నాకౌట్ మ్యాచుల్లో వ‌రుస‌గా 24, 9, 35, 3, 1, 1 ప‌రుగులు చేశాడ‌త‌ను. మొత్తం 73 ప‌రుగులు. స‌గ‌టున 12.16 ప‌రుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 56.15.
 
ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ పేసర్, హ్యాట్రిక్‌ హీరో మహ్మద్‌ షమీని పక్కన పెట్టి స్వింగ్ కింగ్ భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంచుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడినా.. ఎందుకు జట్టులోకి తీసుకోలేదంటూ షమీ కోచ్ బద్రుద్దీన్‌ సిద్ధిఖీ మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

తర్వాతి కథనం
Show comments