Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయమైపోతున్న ధోనీ రికార్డులు - 14 యేళ్ళ తర్వాత తొలి వికెట్ కీపర్‌గా...

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (12:55 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. టీమిండియాకు చెందిన యంగ్ క్రికెటర్లు ఒక్కొక్కరు ఈ రికార్డులను అధికమిస్తున్నారు. దీంతో ధోనీ చేసిన రికార్డులన్నీ ఒక్కొక్కటిగా చెదిరిపోతున్నాయి. 
 
ప్రస్తుతం క్యాలెండర్ ఇయర్‌ 2023లో వన్డే ఫార్మెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ 14 యేళ్ల తర్వాత నిలిచాడు. 
 
పైగా, ఈ తరహా రికార్డును సొంతం చేసుకున్న రెండో వికెట్ కీపర్‌గా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య జట్టుతో గురువారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను రాహుల్ సాధించాడు.
 
ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసిన ఔట్ అయిన రాహుల్.. ప్రస్తుతం క్యాలెండర్ యేడాది 2023లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదాపు 14 యేళ్ల తర్వాత వన్డే ఫార్మెట్‌లో ఒక క్యాలెడర్ యేడాదిలో 1000 పరుగులు సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా రాహుల్ నిలిచాడు. ఇతడి కంటే ముందు భారత మాజీ దిగ్గజం ధోనీ పేరిట ఈ రికార్డు ఉంది. 
 
వన్డేల్లో ఒక యేడాది వెయ్యి పరుగులు సాధించిన తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా మహీ రికార్డు సృష్టించాడు. దాదాపు 14 యేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీట్‌ను సాధించిన  వికెట్ కీపర్‌ రాహుల్ కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

తర్వాతి కథనం
Show comments