Publish Date: Fri, 15 Dec 2023 (13:20 IST)
Updated Date: Fri, 15 Dec 2023 (13:24 IST)
దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్ 7ను ప్రత్యేకంగా వుంచనుంది. ఈ నెంబర్‌ను ఏ ఆటగాళ్లకు కేటాయించకుండా అలానే వుంచనుంది. ఇందులో భాగంగా ధోనీ జెర్సీ నంబర్ 7ను ఏ ఇతర ఆటగాళ్లకు ఇవ్వకుండా రిటైర్ చేసింది.
గతంలో సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10ని కూడా బీసీసీఐ రిటైర్ చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా ధోనీ జెర్సీ నెంబర్‌ని కూడా రిటైర్ చేయనుంది. ధోనీ సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా అందుకుంది.
మహీ తన కెరీర్‌లో 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో చివరిసారిగా టీమిండియా జెర్సీ ధరించాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.