ఢిల్లీ క్యాపిటల్స్ అలవోక విజయం - 8వ స్థానానికి పంజాబ్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (09:36 IST)
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి ముంబైలో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ జట్టు నిర్ధేశించిన 116 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ఛేదించింది. మరోవైపు, ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు వరుసగా క్యూ కట్టారు. జట్టులో జితేష్ శర్మ చేసిన 32 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. 
 
ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 24, షారూక్ ఖాన్ 12, రాహుల్ చాహర్ 12 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేక పోయారు. ఫలితంగా ఆ జట్టు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. 
 
ఆ తర్వాత 116 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కేవలం 10.3 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పృథ్వీషా 20 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 41 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిర్సర్ బాది 60 పరుగులు చేశారు. ఫలితంగా తొలి వికెట్‌కు ఏకంగా 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
 
షా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 12 పరుగులు చేసి వార్నర్‌కు అండగా నిలిచాడు. దీంతో ఢిల్లీ జట్టు 9 వికెట్లతో విజయభేరీ మోగించింది. బౌలింగ్‌ పొదుపుగా చేసిన కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments