Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పేసిన కిరన్ పొలార్డ్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (09:13 IST)
వెస్టిండిస్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మెట్లకు ఆయన గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు వన్డే జట్టుగా వ్యవహరిస్తున్నాడు. పొల్లార్డ్ నాయకత్వంలో ఆ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోతుంది. దీంతో పొల్లార్డ్ తన క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. 
 
ఈ సందర్భంగా ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఎంతో మంది క్రికెటర్ల తరహాలోనే తాను కూడా వెస్టిండీస్ జట్టు తరపున ఆడాలని కలలు కన్నానని చెప్పారు. పదేళ్ళ వయసు నుంచే తాను కరేబియన్ జట్టుకు ఆడటం కోసం తహతహలాడానని చెప్పారు. తాను కలలు కనినట్టుగానే 15 యేళ్ళ పాటు జట్టుకు వన్డేలు, టీ20 ఫార్మెట్లలో సేవలు అందించడం పట్ల గర్విస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
37 యేళ్ల పొలార్డ్ 2007లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 123 అంతర్జాతీయ వన్డేలు ఆడిన ఆయన 26.01 సగటుతో 2706 పరుగులు చేశాడు. వాటిలో మూడు సెంచరీలు, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
అలాగే, 101 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 25.30 సగటుతో 1569 పరుగులు సాధించారు. వాటిలో ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే వన్డేల్లో 55 వికెట్లు, టీ20 మ్యాచ్‌లో 42 వికెట్లు పడగొట్టాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments