Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాట్స్‌మెన్లే మాకొంప ముంచుతున్నారు : రోహిత్ శర్మ

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2018 టోర్నీలో ఉన్న జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఈ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లలో అనూహ్యంగా ఓడిపోతోంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ జట్టు చేతిలో కూడా ఇదే విధంగా ఓడ

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (16:07 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2018 టోర్నీలో ఉన్న జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఈ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లలో అనూహ్యంగా ఓడిపోతోంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ జట్టు చేతిలో కూడా ఇదే విధంగా ఓడిపోయింది.
 
దీనిపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, తమ జట్టు విజయానికి దగ్గరగా వచ్చి ఓటమి పాలవడం తనను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలవడం బాధగా ఉందన్నాడు. విజయం ఖాయమన్న మ్యాచులను ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిపారు. 
 
అదేసమయంలో తమ జట్టు బ్యాటింగ్ తీరుపైనా రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా, మంచి స్కోర్లు సాధించలేకే రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయినట్టు చెప్పాడు. ఇంకొన్ని పరుగులు చేయాల్సి ఉండేందని, తమ బ్యాట్స్‌మెన్ ఇంకొంత మెరుగ్గా ఆడి ఉండాల్సిందని అన్నాడు. 
 
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో బౌలర్లు చక్కగా బౌలింగ్ చేసినా, బ్యాట్స్‌మెన్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమన్నాడు. బౌలర్లు రాణించారని, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారని ప్రశంసించాడు. ఒకానొక దశలో విజయం తమ చేతుల్లోకి వచ్చినా అదృష్టం కలిసి రాకే ఓడిపోయినట్టు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments