Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వన్డే జట్టులో సూర్య - ప్రకటించిన బీసీసీఐ

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (11:36 IST)
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇప్పటికే టెస్టు సిరీస్ పూర్తి చేసి ట్వంటీ20 సిరీస్‌ను ఆడుతోంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ 20వ తేదీన జరుగనుంది. అయితే, ఇంగ్లండ్‌తో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ఈ రోజు ప్ర‌క‌టించింది. 
 
ఈ జ‌ట్టులో సూర్యకుమార్ యాదవ్, క్రునాల్ పాండ్యాకు చోటుద‌క్కింది. టీమిండియా స్క్వాడ్‌లో విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర ఛాహెల్, కుల్దీప్ యాద‌వ్‌, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఎండీ సిరాజ్, ప్ర‌సిధ్‌ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు.
 
మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆ మూడు మ్యాచులు పూణెలోనే జ‌ర‌గ‌నున్నాయి. మొద‌టి వ‌న్డే ఈ నెల 23న‌, రెండో వ‌న్డే 26న‌, మూడో వ‌న్డే 28న జ‌రుగుతుంది. కాగా, టెస్టు సిరీస్‌లో విజ‌యం సాధించిన టీమిండియా ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న‌ టీ20ల్లోనూ విజ‌యం సాధించాల‌న్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లూ 2-2 తేడాతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నిర్ణ‌యాత్మ‌క ఐదో టీ20పై ఉత్కంఠ నెల‌కొంది. నాలుగో  టీ20 మ్యాచు‌లో సూర్యకుమార్ అద్భుతంగా రాణించ‌డంతో వ‌న్డే సిరీస్‌లో చోటుదక్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments