Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్‌లో చేతులెత్తేసిన కరేబియన్లు.. 3 రోజుల్లోనే టెస్ట్ ఫినిష్.. సిరీస్ భారత్ వశం

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (17:30 IST)
హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. దీంతో టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో విజయం సాధించి, 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇది సొంతగడ్డపై కోహ్లి సేనకు ఇది వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులు చేసింది. తద్వారా భారత్ 56 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను కేవలం 127 పరుగులకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. 
 
టెస్ట్ కెరీర్‌లో పది వికెట్లు తీయడం ఉమేష్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు పృథ్వీ షా, కేఎల్ రాహుల్ సునాయాస విజయం సాధించి పెట్టారు. పృథ్వీ 33, రాహుల్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 272 పరుగులతో భారత క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన కోహ్లి సేన.. రెండో టెస్ట్‌లో 10 వికెట్లతో గెలవడం విశేషం.
 
సంక్షిప్త స్కోరు 
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : 311 ఆలౌట్
బ్యాటింగ్.. ఛేజ్ 106, హోల్డర్ 52. 
బౌలింగ్.. ఉమేష్ యాదవ్ 6 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు. 
భారత్ తొలి ఇన్నింగ్స్ : 367
బ్యాటింగ్.. పృథ్వీ షా 70, విరాట్ కోహ్లీ 45, రహానే 80, ఆర్ఆర్ పంత్ 92, అశ్విన్ 35,
బౌలింగ్.. హోల్డర్ 8, గాబ్రియల్ 3. 
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ : 127 ఆలౌట్. 
బౌలింగ్.. ఉమేష్ యాదవ్ 4, జడేజా 3. 
భారత్ రెండో ఇన్నింగ్స్ : 75 నాటౌట్
మ్యాచ్ ఫలితం : 10 వికెట్ల తేడాతో భారత్ విజయం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments