Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాకు షాకిచ్చిన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్!

Webdunia
ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (14:48 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ మహిళా జట్టు తేరుకోలేని షాకిచ్చింది. ఆస్ట్రేలియా జట్టు 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాదు వ‌న్డేల్లో ఇండియ‌న్ వుమెన్స్ టీమ్ చేజ్ చేసిన అత్య‌ధిక స్కోరు కూడా ఇదే కావ‌డం విశేషం. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్... ప్రత్యర్థి ముంగిట 265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది ఈ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు మ‌రో 3 బంతులు మిగిలి ఉండ‌గా ఛేదించింది. అయితే ఇప్ప‌టికే తొలి రెండు వ‌న్డేలు గెలిచిన ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ ఎగ‌రేసుకుపోయింది. ఇక ఈ నెల 30 నుంచి ఈ రెండు టీమ్స్ ఏకైక పింక్ బాల్ టెస్ట్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి.
 
రెండో వ‌న్డేలోనూ గెలిచేలా క‌నిపించిన ఇండియ‌న్ వుమెన్స్ టీమ్‌.. చివ‌రి బంతికి ఝుల‌న్ గోస్వామి నోబాల్ వేయ‌డంతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే మూడో వ‌న్డేలో మాత్రం అలాంటి త‌ప్పిదానికి తావివ్వ‌కుండా జాగ్ర‌త్త‌ ఆడి గెలుపుతో పాటు.. ఆసీస్ రికార్డుకు బ్రేక్ వేశారు. 



 

సంబంధిత వార్తలు

జిల్లాల వారీగా ప్రతి ఒక్కరినీ కలుస్తా : మంత్రి పవన్ కళ్యాణ్

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు ఎపుడు?

అమెరికాలో గన్ కల్చర్.. భారతీయ యువతి మృతి

జనసేనానికి భారీ భద్రత.. కమాండోలతో కూడిన నాలుగు కార్లు

జమ్మూకాశ్మీర్‌లో పెట్రేగుతున్న ఉగ్రవాదులు... ఉక్కుపాదంతో అణిచివేయాలంటూ ప్రధాని ఆదేశం

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : నటి హేమకు తాత్కాలిక ఊరట!!

హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో హనీమూన్ ఎక్స్ ప్రెస్ : చిత్ర యూనిట్

కోలీవుడ్‌లో విషాదం : 'మహారాజ' నటుడు ప్రదీప్ కన్నుమూత

చంద్రబాబు గారిని కలిసి కుప్పం బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశానని ని చెప్పా : హీరో సుధీర్ బాబు

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments