Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్‌ 2023: భారత్ వర్సెస్ శ్రీలంక.. ఊరిస్తున్న రికార్డులు

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (10:04 IST)
ప్రపంచ కప్‌లో భాగంగా.. శ్రీలంకతో భారత్ పోరు నేడు జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. 
 
ఇంకా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. అంతేగాకుండా వరుసగా ఏడు వరల్డ్ కప్ మ్యాచ్‌లో గెలిచిన రికార్డును టీమిండియా సృష్టిస్తుంది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డులు ఏంటో పరిశీలిద్దాం..
 
1. వన్డేల్లో 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసే అవకాశాలున్నాయి. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 48 సెంచరీలు ఉన్నాయి.
 
2. ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000 పరుగులు ఎక్కువసార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం విరాట్, సచిన్ టెండూల్కర్‌ సమానంగా ఉన్నారు. సచిన్‌ను అధిగమించేందుకు కోహ్లీ కేవలం 34 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు.  
 
3. శ్రేయాస్ అయ్యర్ తన తదుపరి మూడు మ్యాచ్‌ల్లో 65 పరుగులు చేస్తే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మూడవ వేగవంతమైన భారతీయ క్రికెటర్‌గా నిలుస్తాడు.
 
4. శ్రీలంక బౌలర్ మాథ్యూస్, రోహిత్ శర్మను వన్డేల్లో ఇప్పటివరకు ఏడుసార్లు అవుట్ చేశాడు. రోహిత్‌ను అందరి కంటే ఎక్కువసార్లు ఔట్ చేసింది ఈ బౌలరే కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments