Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమర్శకుల నోళ్లు మూయించిన పాకిస్థాన్ జట్టు.. సెమీస్ ఆశలు సజీవం!!

pakistan team
, బుధవారం, 1 నవంబరు 2023 (11:38 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా మంగళవారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నవారి నోళ్లను మూయించింది. ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. 
 
దీంతో ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. అయితే, బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత పాక్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. మూడు, నాలుగు స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకంటే రెండు పాయింట్లు వెనుకబడివుంది. పాక్ జట్టు ఇంకా మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. అదేసమయంలో ఇతర జట్ల గెలుపోటముల కోసం పాక్ జట్టు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఓటమి పాలైతే పాక్ అవకాశాలు మెరుగవుతాయి. లేదంటే సెమీఫైనలు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇదిలావుంటే, పాకిస్థాన్‌ జట్టు చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోవడంతో ఆ జట్టు సెమీఫైనల్ ఆశలు ముగిసిపోయాయి. బంగ్లాదేశ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్కటంటే ఒక్క విజయం మాత్రమే సాధించింది. 
 
రెండు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా టాప్-4లోకి ప్రవేశించే అవకాశమే లేదు. కాబట్టి షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా ఇప్పటివరకు ఏ జట్టూ సెమీఫైనల్ స్థానాన్ని ఖరారు చేసుకోకపోవడం గమనార్హం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ క్రికెటర్లు మటన్ తిండిబోతులన్న అక్రమ్: ఆన్‌లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న పాక్ టీమ్