Webdunia - Bharat's app for daily news and videos

Install App

డర్బన్‌లో సఫారీలను చితక్కొట్టిన కోహ్లీ సేన

సొంత గడ్డపై వరుసగా 17 మ్యాచ్‌లు నెగ్గిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు టీమిండియా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. అలాగే ఇక్కడి కింగ్స్‌మీడ్‌ మైదానంలో తమ చెత్త రికార్డును సవరించుకుంటూ తొలి విజయాన్ని అందుకుంది

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (10:45 IST)
సొంత గడ్డపై వరుసగా 17 మ్యాచ్‌లు నెగ్గిన జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు టీమిండియా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. అలాగే ఇక్కడి కింగ్స్‌మీడ్‌ మైదానంలో తమ చెత్త రికార్డును సవరించుకుంటూ తొలి విజయాన్ని అందుకుంది. విరాట్‌ కోహ్లీ (119 బంతుల్లో 10 ఫోర్లతో 112) శతకానికి తోడు రహానె (86 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 79) క్లాస్‌ ఇన్నింగ్స్‌ జత కలవడంతో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ నెగ్గింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 268 పరుగులు చేసింది. ఆ తర్వాత కింగ్స్‌మీడ్‌ మైదానంలో 270 పరుగుల లక్ష్యమా..? కష్టమే అన్న విశ్లేషకుల అంచనాలను కోహ్లీ సేన తారుమారు చేస్తూ, గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఈ స్టేడియంలో ఇదే అత్యధిక లక్ష్యఛేదన కావడం విశేషం. 
 
అంతకుముందు పేసర్లకు అనుకూలిస్తుందనుకున్న ఈ పిచ్‌పై అనూహ్యంగా భారత స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌ రాజ్యమేలారు. అయితే 134 పరుగులకే ఐదు వికెట్లు పడినా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఒంటరి పోరాటంతో శతకం బాది దక్షిణాఫ్రికాకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. ఆ తర్వాత 269 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ సేన... 45.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

తర్వాతి కథనం
Show comments