149 ఫోర్లు... 65 సిక్సర్లు... 1045 పరుగులు...

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 13 యేళ్ల బుడతడు ఒకడు అండర్ 14 క్రికెట్ మ్యాచ్‌లో ఏకంగా 1,045 పరుగులు చేశాడు. అండర్-14 ముంబై షీల్డ్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కోపార

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (10:23 IST)
ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 13 యేళ్ల బుడతడు ఒకడు అండర్ 14 క్రికెట్ మ్యాచ్‌లో ఏకంగా 1,045 పరుగులు చేశాడు. అండర్-14 ముంబై షీల్డ్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కోపార్ కహిరానె - నవీ ముంబై జట్ల మధ్య మంగళవారం జరిగిన సెమీ ఫైనల్  మ్యాచ్ జరిగింది. ఇందులో తనిష్క్ గవాటే అనే యువ క్రికెటర్ తన అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 
 
యశ్వంత్ రావ్ చవాన్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్ తాజాగా 515 బంతుల్లో 149 ఫోర్లు, 67 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో తనిష్క్ అజేయంగా 316 పరుగులు చేయడం విశేషం. అతడి బ్యాటింగ్ శైలిని, ఎనర్జీని చూసిన క్రీడా పండితులు ఆశ్చర్యపోతున్నారు.
 
కాగా, తనిష్క్ బ్యాటింగ్‌తో రెండేళ్ళ క్రితం నమోదైన రికార్డు చెరిగిపోయింది. భండారీ కప్ ఇంటర్-స్కూల్ టోర్నమెంట్‌లో భాగంగా ప్రణవ్ ధనవాడే అనే క్రికెటర్ 1,009 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడా రికార్డును తనిష్క్ తిరగరాశాడు. 1009 పరుగులు చేసిన ధనవాడే స్కూల్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 1899లో అర్ధర్ కోలిన్స్ చేసిన 628 పరుగుల రికార్డును తుడిచిపెట్టేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.. వైద్య విద్యార్థిని మృతి

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతా: కల్వకుంట్ల కవిత

Duvvada: బర్త్ డే పార్టీ కేసు: మాధురి బంధువు పార్థసారధికి నోటీసులు

వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తాం : నితిన్ నబిన్

'భారత్ ఇప్పుడు పాతది కాదు, ఇది మారుతోంది' : విదేశీ మహిళ ఫిదా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayendra Prasad: పవన్ మహావీర్ హీరోగా అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం

singer Smita: ఓజి× మసక మసక సాంగ్ అందరినీ అలరిస్తుంది : పాప్ సింగర్ స్మిత

Sobhan Babu: నేటి టెక్నాలజీ తో శోభన్ బాబు- సోగ్గాడు రీ రిలీజ్

బాలకృష్ణ అఖండ-2 ఘన విజయం - థియేటర్లలో పూనకాలు (Video)

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9వ సీజన్‌లో విన్నర్ ఎవరు? ఏఐ ఎవరికి ఓటేసిందంటే?

తర్వాతి కథనం
Show comments