Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్ లైన్‌ గేమ్‌లో ఓడిపోయాడు.. మానిటర్‌లో తలదూర్చేశాడు.. చైనాలో దారుణం

స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల పుణ్యంతో ప్రస్తుతం చిన్నారులు, యువత వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఫోన్లు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. వీడియో గేమ్స్ కోసం ఏమైనా చేసేందుకు రెడీ

ఆన్ లైన్‌ గేమ్‌లో ఓడిపోయాడు.. మానిటర్‌లో తలదూర్చేశాడు.. చైనాలో దారుణం
, శనివారం, 25 మార్చి 2017 (13:30 IST)
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల పుణ్యంతో ప్రస్తుతం చిన్నారులు, యువత వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఫోన్లు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. వీడియో గేమ్స్ కోసం ఏమైనా చేసేందుకు రెడీ అయిపోతున్నారు. అలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనాలో ఆన్‌లైన్ గేమ్‌లకు ఆదరణ ఎక్కువ. చైనా యువత ఆన్ లైన్ గేమ్‌ల కోసం ఏమైనా చేస్తారు. వింతగా ప్రవర్తిస్తారు. 
 
తాజాగా లాంఝూ నగరంలోని ఓ ఇంటర్ నెట్ సెంటర్లో ఒక యువకుడు సీరియస్‌‌గా 'లీగ్ ఆఫ్ లెజెండ్స్' గేమ్ ఆడుతున్నాడు. స్టేజ్‌లు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఓ స్టేజ్ గేమ్‌లో ఓడిపోయాడు. దీంతో ఓటమి భారాన్ని తట్టుకోలేని ఆ యువకుడు.. కోపంతో తలను కంప్యూటర్ స్క్రీన్‌కేసి బాదుకున్నాడు. ఎంత వేగంగా బాదుకున్నాడో ఏమో కానీ.. అతని తల కంప్యూటర్ స్క్రీన్ లోపల ఇరుక్కుపోయింది. 
 
దీంతో ఇంటర్నెట్ సెంటర్ యాజమాన్యం వేగంగా స్పందించి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, అంబులెన్స్‌ను పిలిపించి తలను బయటకు తీశారు. ఈ ఘటనలో యువకుడి ముఖానికి తీవ్రంగా గాయాలైనాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళి ఇంకా బాహుబలి 2 దగ్గరే వున్నారు... బాబు బాహుబలి 3తో వచ్చేశారు... రోజా ఎద్దేవా