Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

రాజమౌళి ఇంకా బాహుబలి 2 దగ్గరే వున్నారు... బాబు బాహుబలి 3తో వచ్చేశారు... రోజా ఎద్దేవా

అమరావతి రాజధాని నిర్మాణాల తాలూకు డిజైన్లు విడుదల చేస్తూ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ... ''బాహుబలి 1, బాహుబలి 2 బాహుబలి 3 అన్నట్లుగా వరుసగా సినిమాలు చ

Advertiesment
Amaravati capital graphics
, శనివారం, 25 మార్చి 2017 (12:44 IST)
అమరావతి రాజధాని నిర్మాణాల తాలూకు డిజైన్లు విడుదల చేస్తూ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ... ''బాహుబలి 1, బాహుబలి 2 బాహుబలి 3 అన్నట్లుగా వరుసగా సినిమాలు చూపిస్తున్నారు, కొత్తకొత్త డిజైన్లతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.ఫోటోలతో మభ్యపెట్టారు. పొగ గొట్టాలతో డిజైన్లు ఎత్తుకొచ్చారు. 
 
ఇటీవలే మాకీ సంస్థ నుంచి మరో సంస్థకు నిర్మాణాల కట్టే ఒప్పందాన్ని మార్చేసుకున్నారు. ప్రతిపక్షాన్ని పిలువలేదు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల భూములను దోచుకున్నారు. రెండు డిజైన్లు అయిపోయాయి. మూడో డిజైన్ మరొకటి వచ్చింది. రాష్ట్రంలోని సమస్యలపై మాట్లాడనివ్వరు. కానీ గ్రాఫిక్స్ ఫైనలైజ్ చేస్తారట. 
 
బాహుబలి -1, బాహుబలి 2 చూపించారు. ఇప్పుడు బాహుబలి 3తో వచ్చారు. రాజధాని కట్టకుండా బొమ్మలు చూపిస్తున్నారు. నిర్మించే రాజధాని కట్టడాలకు సంబంధించి అసలు డిజైన్లు చూపించండి. ఇలాంటి మభ్యపెట్టే డిజైన్లను చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. రైతులకివ్వాల్సిన ప్యాకేజీలు ఇవ్వడంలేదు. ఒక్క ఇటుకరాయి కూడా పెట్టకుండా డిజైన్లతో రాజధానిలో ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పిస్తున్నారు. మీ మాయామహల్ మాయలను ఆపండి" అంటూ రోజా ధ్వజమెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంచం తీసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. సస్పెండ్ అయ్యాడు..