లంచం తీసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. సస్పెండ్ అయ్యాడు..
సోషల్ మీడియా ప్రభావంతో ప్రస్తుతం చిన్న తప్పు జరిగినా వెలుగులోకి వస్తోంది. లంచం తీసుకోవడం ఎంత తప్పో తెలిసిందే. లంచం తీసుకోవడం ద్వారా ఎన్నో వ్యవస్థలు మసకబారుతున్న తరుణంలో.. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదా
సోషల్ మీడియా ప్రభావంతో ప్రస్తుతం చిన్న తప్పు జరిగినా వెలుగులోకి వస్తోంది. లంచం తీసుకోవడం ఎంత తప్పో తెలిసిందే. లంచం తీసుకోవడం ద్వారా ఎన్నో వ్యవస్థలు మసకబారుతున్న తరుణంలో.. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారుడి నుంచి లంచం వసూలు చేసిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో ఈ వీడియోను ఇప్పటికే ఐదు లక్షల మంది వీక్షించారు.
ఇదంతా హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. హిమాయత్‌నగర్‌లోని వై జంక్షన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ హెల్మెట్ లేని వాహనదారుడిని ఆపాడు. ఆపై అతని వద్ద లంచం తీసుకున్నాడు. దీనిని నగరానికి చెందిన శ్రీధర్ వేముల తన ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీకి ట్యాగ్ చేశాడు. దీంతో ఆ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది.
ఇప్పటికే ఈ వీడియోను ఐదులక్షల మంది వీక్షించగా, పదివేల మంది షేర్ చేశారు. ఈ వీడియో ఆధారంగా లంచం తీసుకున్న ట్రాఫిక్ పోలీస్ సత్యవిష్ణును ట్రాఫిక్ అడిషనల్ సీపీ జితేందర్ సస్పెండ్ అయ్యాడు.