Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్: స్టార్ ప్లేయర్ రీఎంట్రీ.. ఎవరు?

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (21:43 IST)
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాల్గవ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ శుభవార్త వచ్చింది. 
 
గాయాలు, ఆటగాళ్ల గైర్హాజరీతో సతమతమవుతున్న భారత జట్టులోకి ఇప్పుడు ఓ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అడుగుపెట్టబోతున్నాడు. 
 
కేఎల్ రాహుల్ రాంచీలో జరిగే నాల్గవ టెస్టులో భారత జట్టులో భాగం కావచ్చునని తెలుస్తోంది. గాయం కారణంగా రాహుల్ సిరీస్‌లో రెండు, మూడో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం వుంది. 
 
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 123 బంతుల్లో 86 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 48 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments