Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో ఘనతను సాధించిన భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్.. 500 వికెట్ల క్లబ్‌లో చోటు

ashwin

ఠాగూర్

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (16:37 IST)
భారత్ క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. భారత లెజెండ్ క్రికెటర్ అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా ఖ్యాతి గడించారు. కేవలం 98  టెస్టుల్లోనే అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలేను అశ్విన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేసి తన 500 వికెట్‌ను దక్కించుకున్నాడు. ఈ ఘనతను సాధించిన రెండో భారత్ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అనిల్ కుంబ్లే 105 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించగా, అశ్విన్ మాత్రం కేవలం 98 టెస్ట్ మ్యాచ్‌లలోనే సాధించాడు. అయితే, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ మాత్రం 87 మ్యాచ్‌లలో 500 వికెట్టు తీసి మొదటి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ 108 మ్యాచ్‌లో, మెక్ గ్రాత్ 110 మ్యాచ్‌లలో ఈ రికార్డు సాధించారు. 
 
కాగా, పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఉదయం సెషన్‌లో రవీంద్ర జడేజా (112) వికెట్ కోల్పోయిన టీమిండియాకు కొత్త వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ జోడీ విలువైన భాగస్వామ్యం అందించింది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న జురెల్ 2 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేయగా... అశ్విన్ 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. బుమ్రా సైతం బ్యాట్ ఝళిపిస్తూ 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు సాధించాడు. 
 
ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 4, రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ ఆండర్సన్ 1, టామ్ హార్ట్ లే 1, జో రూట్ 1 వికెట్ తీశారు. అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ 36, జాక్ క్రాలీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, తొలిరోజు ఆటలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా సెంచరీలు సాధించడం తెలిసిందే. అరంగేట్రం బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెరిసిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 445