Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్.. తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (08:35 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేసినా భారత్‌కు షాక్ తప్పదని క్రికెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ముగిసిన మ్యాచ్‌లలో ఆప్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ జట్టు పటిష్టమైన ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లను తేరుకోలేని విధంగా చిత్తు చేశాయి. అందువల్ల బంగ్లాదేశ్ కుర్రోళ్లతో భారత్ కాస్తంత జాగ్రత్తగా ఉండాలని భారత క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ మ్యాచ్ పూణె వేదికగా జరుగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధాం. బౌండరీ లైను చిన్నదిగా ఉండటంతో వరుగుల వరద ఖాయంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్‌కు ఉపయోగించే వికెట్‌ను తాజాగా రూపొందించినా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. అయితే గురువారం వర్షం అవకాశం లేదని తేలింది.
 
మరోవైపు, భారత్ తాను ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుస విజయాలు నమోదు చేసుకుంది. ఇపుడు మరో విజయంపై కన్నేసింది. ముఖ్యంగా, చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసిన టీమిండియా.. ఇపుడు నాలుగు విజయం కోసం ఉవ్విళ్లూరుతుంది. రోహిత్ తోపాటు టాపార్డర్ బ్యాటర్లు చెలరేగుతుండగా.. బుల్లెట్ బంతులతో బుమ్రా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి పనిపట్టేందుకు కుల్దీప్ ఉండనే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. 
 
అయితే, గత నాలుగు వన్డేల్లో బంగ్లా చేతిలో టీమిండియా మూడుసార్లు ఓడిందనే విషయాన్ని మరువరాదు. పైగా డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్‌కు ఆఫ్ఘానిస్థాన్, దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ లాంటి పసికూనలు షాకులిస్తున్న నేపథ్యంలో బంగ్లాను ఏమాత్రం తేలిగ్గా తీసుకొన్నా భంగపాటు తప్పదు. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమిండియా ఆ స్థాయి ప్రదర్శనతో అదరగొడుతోంది. ఈ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం మ. 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. 
 
జట్లు (అంచనా) భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
 
బంగ్లాదేశ్ : తన్జిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ షాంటో, షకీబల్ (కెప్టెన్), తౌహిద్, ముష్ఫికర్ (వికెట్ కీపర్), మెహీ హసన్, మహ్మదుల్లా, టస్కిన్, షోరిపుల్ ఇస్లాం, ముష్ఫికర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ ఫ్యూజన్‌ను వేడుక చేసుకునేలా టేకిలాను విడుదల చేసిన లోకాలోక

1వ తేదీ జీతం రాకపోతే ఇంట్లో ఎలా వుంటుందో నాకు తెలుసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

లెహంగాతో వధువు.. పాస్‌కు ఇబ్బంది.. ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తారా?

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments