Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు మరో షాక్ : టెస్ట్ సిరీస్ నుంచి షమీ దూరం

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (15:59 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ టెస్ట్ సిరీస్ నుంచి భారత పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. 
 
ఈ నెల 17వ తేదీ నుంచి జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో శనివారం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాట్ కమిన్స్‌ వేసిన బౌన్సర్ షమీ కుడి చేతికి తగలడంతో అతను గాయపడ్డాడు. దీంతో ఆట మధ్యలోనే రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. 
 
తీవ్ర నొప్పితో బాధపడిన షమీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ నిర్వహించారు. తన చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు డాక్టర్లు తెలపడంతో షమీ సిరీస్‌లోని ఆఖరి మూడు టెస్టులకు దూరంకానున్నాడు. 
 
'షమీ చేతికి ఫ్రాక్చర్‌ అయింది. అందుకే అతడు క్రీజులో బ్యాట్‌ను పట్టుకొని పైకి ఎత్తలేకపోయాడు. గాయం తీవ్రత పెద్దదేనని' షమీ సన్నిహిత వర్గాల సమాచారం. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments