Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం.. ఎపుడు?

క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2019లో జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుండగా, 2023లో జరిగే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (11:26 IST)
క్రికెట్ ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. 2019లో జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుండగా, 2023లో జరిగే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ దఫా భారత్ ఒక్కటే మెగా ఈవెంట్‌ను నిర్వహించనుంది. 
 
వాస్తవానికి భారత్‌ గతంలో 1987, 1996, 2011 ప్రపంచకప్‌లకు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చింది. 2021 ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా భారత్‌లోనే జరగనుంది. భారత జట్టు 2019 నుంచి 2023 వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 81 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. గత భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ)లో కంటే ఇవి 31 మ్యాచ్‌లు ఎక్కువ. సోమవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 
 
ఇకపోతే, ఇటీవలే టెస్టు హోదా దక్కించుకున్న పసికూన అప్ఘనిస్థాన్‌కు భారత్‌ సాదర స్వాగతం పలికింది. ఆ దేశ అరంగేట్ర టెస్టుకు ఆతిథ్యమివ్వాలని నిర్ణయించింది. తీవ్రవాదంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నా అఫ్గాన్‌ గత కొన్నేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదిగింది.

ఐర్లాండ్‌తో పాటు జూన్‌లో టెస్టు హోదాను దక్కించుకుంది. నిజానికి అఫ్గానిస్థాన్‌ తన తొలి టెస్టును 2019లో ఆస్ట్రేలియాతో ఆడాల్సివుంది. కానీ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాల రీత్యా అఫ్గాన్‌కు భారత్ మొదట ఆతిథ్యమివ్వాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments