Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఇండో - పాక్ మ్యాచ్ టిక్కెట్లు (video)

Webdunia
సోమవారం, 6 మే 2019 (11:29 IST)
ఐసీసీ ప్రపంచ క్రికెట్ టోర్నీలో భాగంగా జూన్ 16వ తేదీన భారత్ - పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియదు. కానీ, ఈ మ్యాచ్ టిక్కెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 
 
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు మొదలు పెట్టిన 48 గంటల్లోనే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. 
 
దీంతో, ఈ మ్యాచ్ జరుగుతుందో, లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ, క్రికెట్ ప్రేమికులు మాత్రం దీన్నేమీ పట్టించుకోకుండా... టికెట్లను సొంతం చేసుకున్నారు. మరోవైపు, భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఇది మరోమారు నిరూపించింది. 
 
కాగా, ఐసీసీ నిర్వహించే ప్రధాన ఈవెంట్లలో భారత్ పాకిస్థాన్ జట్లు పలు సందర్భాల్లో తలపడ్డాయి. కానీ, ఇప్పటివరకు పాకిస్థాన్ జట్టు మాత్రం విజయం సాధించలేదు. దీంతో ఇరు జట్లు ఆడే మ్యాచ్‌లు అంటే క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments