Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తిత్వం లేని గౌతం గంభీర్? పాక్ క్రికెటర్ మండిపాటు

Advertiesment
వ్యక్తిత్వం లేని గౌతం గంభీర్? పాక్ క్రికెటర్ మండిపాటు
, శనివారం, 4 మే 2019 (12:16 IST)
భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ రాజకీయాల్లో చేరి ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. సౌత్ ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈయన తన ఎన్నికల ప్రచారంలో విపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలు కొన్ని సందర్భాల్లో బౌనర్లుగా మారితిరిగి ఆయనకే తగులుతున్నాయి. 
 
తాజాగా గౌతం గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ క్రికెట్ చిచ్చరపిడుగు షాపిద్ ఆఫ్రిది ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గౌతం గంభీర్‌కు అసలు వ్యక్తిత్వం అనేది లేదన్నారు. పైగా, అతని క్రికెట్ జీవితంలో గొప్ప రికార్డులేవీ లేవని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆఫ్రిది ఓ ట్వీట్ చేశారు. 'కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతంగా ఉంటాయి. మరికొన్ని ప్రొఫెషనల్‌గా ఉంటాయి. గంభీర్ విషయానికి వచ్చే సరికి శత్రుత్వం అనేది వ్యక్తిగతమే. అతడి వైఖరే ప్రధాన సమస్య. గంభీర్‌కు అసలు వ్యక్తిత్వమే లేదు. క్రికెట్‌లో అతడికి గొప్ప రికార్డులేవీ లేవు. ఒక విధమైన వైఖరి తప్ప' అని వ్యాఖ్యానించారు. 
 
క్రికెట్‌ అనే పెద్ద ప్రపంచంలో అతను ఒక పాత్ర మాత్రమే. కానీ, గంభీర్‌ మాత్రం డాన్‌ బ్రాడ్‌మన్‌, జేమ్స్‌బాండ్‌ లక్షణాలు కలిపి తనలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఫోజులిస్తుంటాడు. చెప్పుకోదగ్గ ఒక్క రికార్డు కూడా గంభీర్‌కు లేదు. కేవలం అతని ప్రవర్తనతోనే అందరి నోళ్లలో నానుతుంటాడు అని ఆఫ్రిది ఫైర్ అయ్యారు. 
 
గంభీర్ వైఖరి పోటీ పడేలా ఉండదని, ఎప్పుడూ నెగెటివ్‌గానే ఆలోచిస్తాడని చెప్పాడు. గంభీర్ మాత్రం పాజిటివ్‌గా ఆలోచించే వాళ్లను ఇష్టపడతానని, కానీ, అతను మాత్రం అలా ఉండడని తెలిపారు. ఈ సందర్భంగా 2007లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. 
 
ఆసియాకప్‌ సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న గంభీర్‌ ఒక పరుగు పూర్తి చేసి రెండో రన్‌ కోసం పరుగెత్తుతున్న సమయంలో నేరుగా నా ఎదురుగా వచ్చాడు. అప్పుడు ఇద్దరం అసభ్య పదజాలంతో తిట్టుకున్నాం. ఆ విషయాన్ని నేనిప్పటికీ మర్చిపోలేదు. కరాచీలో గంభీర్‌ను తాము 'సర్యల్'(మాడిపోతున్న వాడు) అని పిలుస్తామంటూ అక్కసు వెళ్లగక్కాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత..? 24 గంటల్లో వివరణ ఇవ్వాలన్న సుప్రీం