Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ : భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ - చెత్త రికార్డు నెలకొల్పిన షమీ!

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (15:46 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం కీలక మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‍‌లో పాకిస్థాన్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, జట్టు ప్రస్తుతం ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 13 ఓవర్లలో 59 పరుగులు చేసింది. ఓపెనర్ బాబర్ అజామ్ 23, ఇమామ్ ఉల్ హక్ 10 చొప్పున పరుగులు చేశారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బాబర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, అక్షర్ పటేల్ మెరుపు వేగంతో స్పందించి వికెట్లను నేలకూల్చడంతో ఇమామ్ ఉల్ హక్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 
 
ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో మహ్మద్ షమీ చెత్త రికార్డును నెలకొల్పాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సుధీర్ఘమైన ఓవర్ వేసిన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. తొలి ఓవర్‌లో ఐదు వైడ్ బాల్స్ వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. భారత్ తరపున ఒక ఓవర్‌‍లో ఇన్ని బంతులు వేసిన వారి జాబితాలో అంతకుముందు జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్‌లు ఉన్నారు. 
 
ఇక జహీర్ అయితే ఆరు సందర్భాల్లో ఓవర్‌కు పదేసి బంతులు చొప్పున విరిసారు. ఈ రికార్డులో అగ్రస్థానంలో బంగ్లాదేశ్‌కు చెందిన హసిబుల్ హుస్సేన్, జింబాబ్వేకు చెందిన తినస్యే పన్యాంగరలు ఉన్నారు. వీరిద్దరూ ఓవర్‌లో 13 బంతులు విసిరారు.
 
ఇదిలావుంటే షమీకి గాయం తిరగెట్టిందా అనే సందేహం వ్యక్తమవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్ బౌలింగ్ సందర్భంగా కుడికాలిలో కొంత సమస్య తలెత్తింది. దీంతో ఓ ఓవర్ పూర్తి చేసి మైదానాన్నీ విడాడు. తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఐదు వికెట్లు తీసిన షమీకి ఈ మ్యాచ్‌లో గాయం తిరగబెట్టిందా? అనే సందేహం ఉత్పన్నమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

తాలిబన్ పాలిత దేశంలో ప్రకృతి ప్రళయం... వందల్లో మృతులు

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments