Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ట్వంటీ20 : క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన కోహ్లీ సేన

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (10:15 IST)
ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మంగళవారం మూడో ట్వంటీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వరుసగా మొదటి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇపుడు మూడో టీ20 మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. 
 
గత 2016లో కంగూరూలపై పొట్టి సిరీస్‌ను 3-0తో పట్టేసిన భారత్‌ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేయాలని తహతహలాడుతున్నది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చివరి పంచ్‌ కూడా బలంగా ఇచ్చి ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో కొండంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తున్నది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నది. 
 
కాగా, సుధీర్ఘ కాల పర్యటనకు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేన... ప్రారంభంలో తొలి రెండు వన్డేలు ఓడి సిరీస్‌(2-1)కోల్పోయిన టీంఇండియా ఆ తర్వాత సత్తాచాటింది. వన్డే పరాభవానికి బదులు తీర్చుకుంటూ టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ మెరువగా హార్దిక్‌ పాండ్య భీకర ఫామ్‌తో గత మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఊదేసింది. 
 
రాహుల్‌, అయ్యర్‌ సైతం చివరి టీ20లో సత్తాచాటితే కోహ్లీసేనకు తిరుగుండదు. బౌలింగ్‌ విషయానికొస్తే యార్కర్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌ ఎంతో పరిణతితో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. రెండో టీ20లో చాహల్‌ సహా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చిన చోట ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.  
 
ఇకపోతే, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయం నుంచి తిరిగి కోలుకుని జట్టులో చేరనున్నాడు. క్లీన్‌స్వీప్‌ను తప్పించుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న కంగారూలు మూడో టీ20లో ఎలాగైనా సత్తాచాటాలని పట్టుదలగా ఉన్నారు. గత మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఓపెనర్‌ వేడ్‌తో కలిసి ఫించ్‌ బ్యాటింగ్‌కు వస్తే.. షార్ట్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల తుది అంచనా 
భారత్ ‌: ధావన్‌, రాహుల్‌, కోహ్లీ(కెప్టెన్‌), శాంసన్‌, శ్రేయస్‌, హార్దిక్‌, శార్దుల్‌, సుందర్‌, చాహర్‌, నటరాజన్‌, చాహల్‌. 
ఆస్ట్రేలియా : ఫించ్‌/షార్ట్‌, వేడ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, స్టొయినిస్‌, అబాట్‌, సామ్స్‌, స్వెప్సన్‌, జంపా, అండ్రూ టై. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments