Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా సర్జన్ జనరల్‌గా ఇండో అమెరికన్ వివేక్ మూర్తి

Advertiesment
అమెరికా సర్జన్ జనరల్‌గా ఇండో అమెరికన్ వివేక్ మూర్తి
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (08:40 IST)
అగ్రరాజ్యం అమెరికా దేశ 46వ అధ్యక్షుడుగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ జనవరి 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెలలో జరిగిన యూఎస్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. దీంతో అమెరికాలో అధికార మార్పిడి జరుగనుంది. 
 
ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అపుడే రంగంలోకి దిగారు. ఈయన తన ఆరోగ్య బృందాన్ని ప్రకటించారు. అమెరికా వైద్య శాఖ మంత్రిగా జేవియర్‌ బెకెర్రా, సర్జన్‌ జనరల్‌గా ఇండియన్‌ అమెరికన్‌ వివేక్‌ మూర్తిని నియమించారు. కొవిడ్‌-19పై అధ్యక్షుడికి ప్రధాన సలహాదారుగా సాంక్రమిక వ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌసీ పేరును ప్రకటించారు.
 
అదేవిధంగా, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డైరెక్టర్‌గా రోషెల్‌ వాలెన్‌స్కీ, కొవిడ్‌-19 ఈక్విటీ టాస్క్‌ఫోర్స్‌ చైర్‌పర్సన్‌గా మార్కెల్లా నుమెజ్‌ స్మిత్‌ను నియమించారు. ఈ సమర్థ నాయకత్వ బృందం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని బైడెన్‌ పేర్కొన్నారు. 
 
కరోనా పరీక్షల నిర్వహణ, వ్యాక్సిన్‌ పంపిణీ, పాఠశాలలు, పరిశ్రమల పునఃప్రారంభం, వైద్య సేవలను విస్తరించడంలో అన్ని వనరులను సమీకృతపరిచేందుకు ఈ నిపుణుల బృందం మొదటి రోజు నుంచే పని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తినే ఆహారం విష పదార్థం.. అందుకే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి???