Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీ!

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (14:43 IST)
భారత క్రికెట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందెన్నడూ ఏ ఒక్క భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌కు సాధ్యంకాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటిస్తోంది. అయితే, ఆసీస్ గడ్డపై అన్ని ఫార్మాట్ల‌లో సిరీస్‌లు గెలిచిన ఏకైక భార‌త కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఓవ‌రాల్‌గా చూసుకుంటే సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెస్సీ త‌ర్వాత రెండోస్థానంలో కోహ్లి ఉన్నాడు. 
 
కోహ్లీ కెప్టెన్సీలో గ‌త పర్య‌ట‌న‌లో ఆస్ట్రేలియాపై తొలిసారి టెస్ట్ సిరీస్‌తోపాటు వ‌న్డే సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. అయితే టీ20 సిరీస్ మాత్రం అప్పుడు 1-1తో స‌మ‌మైంది. ఇప్పుడు వ‌రుస‌గా రెండు టీ20లు గెల‌వ‌డం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీమిండియా గెలుచుకుంది. ఈ విజ‌యంతో గ‌తంలో ఏ ఇండియ‌న్ కెప్టెన్‌కూ సాధ్యం కాని రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 
 
కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య వన్డే, ట్వటీ20, టెస్టు సిరీస్‌లను ఆడుతోంది. ఇందులో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో ఓడిపోయింది. కానీ, ట్వంటీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ తర్వాత నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments