Webdunia - Bharat's app for daily news and videos

Install App

#WorldCup2023 షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (17:37 IST)
భారత్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీకి చెందిన షెడ్యూల్ వచ్చింది. అక్టోబరు - నవంబర్ నెలల్లో ఈ టోర్నీ జరుగనుంది. ఈ మోగా టోర్నీకి చెందిన మ్యాచ్ ‌షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబరు నెల 5వ తేదీన అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. 
 
అలాగే, లీగ్ దేశలో భారత్ 9 మ్యాచ్‌లను ఆడుతుంది. అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబరు 15న చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15, 16న ముంబై, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు.
 
నవంబరు 19న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. రెండు సెమీ ఫైనల్స్ తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే (నవంబర్ 20) ఉంది. ధర్మశాల, ఢిల్లీ, లక్నో, పూణె, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వేదికలుగా మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 
 
హైదరాబాద్ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. చెన్నై ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. పాకిస్థాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఐసీసీ దానిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

పిఠాపురంలో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

తర్వాతి కథనం
Show comments