Varuj tej at shooting spot
వరుజ్ తేజ్ 13వ చిత్రం షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాల్లో మెరుపు వేగంతో దూసుకుపోతోంది. ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ ప్రస్తుతం అపూర్వమైన స్థాయిలో చిత్రీకరించబడుతోంది. ఇటీవలే తన 12వ చిత్రానికి గాండీవ దారి అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ కొత్త సినిమాకు త్యరలో టైటిల్ పెట్టనున్నారు. ఇటీవలే లావణ్య త్రిపాఠీ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక వరుజ్ షూట్ పాల్గొన్న చిత్రం ఇదే.
హర్యానాకు చెందిన 67వ మిస్‌వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ రచన మరియు దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై సందీప్ ముద్దా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది. ఇది వరుణ్ తేజ్ హిందీలో తొలిసారిగా నటించింది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.