Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : భారత్ బ్యాటింగ్ .. వైస్ కెప్టెన్ ఔట్

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (15:44 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య కీలక లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భాగంగా గురువారం మాంచెష్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 
 
దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు మొదటి వికెట్‌కు 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యక్తిగత స్కోరు 18 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. మొత్తం 23 బంతులు ఎదుర్కొన్న రోహిత్... ఓ సిక్సర్, ఒక ఫోర్ సాయంతో 18 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 7.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. 
 
అంతకుముందు ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో గాయపడిన భువనేశ్వర్ ఫిట్నెస్ సాధించినప్పటికీ.. మేనేజ్‌మెంట్ మాత్రం మహ్మద్ షమీనే నమ్ముకుంది. అందుకే తుదిజట్టులో షమీకే స్థానం కల్పించారు. 
 
భువీకి కూడా స్థానం కల్పిస్తారని, భారత్ ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలో దిగుతుందని మ్యాచ్ ముందు ప్రచారం జరిగినా, స్పిన్ ఆడడంలో విండీస్ తడబడుతుందన్న నేపథ్యంలో కోహ్లీ ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లకే ఓటేశాడు. దాంతో, చహల్, కుల్దీప్ యాదవ్ తమ స్థానాలు నిలుపుకున్నారు. అలాగే, వెస్టిండీస్ జట్టు రెండు మార్పులు చేసింది. 
 
జట్టు వివరాలు 
భారత్ : రాహుల్, రోహిత్, కోహ్లీ, శంకర్, జాదవ్, ధోనీ, పాండ్యా, షమీ, కుల్దీప్, చాహల్, బుమ్ర. 
 
వెస్టిండీస్ : గేల్, అంబ్రీస్, హోప్, పూరన్, హెట్మియర్, హోల్డర్, బ్రాత్‌వైట్, అలెన్, రోచ్, కోట్రెల్, థామస్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan : కాపు సామాజిక వర్గానికి 5శాతం రిజర్వేషన్ అమలు చేయాలి

రోడ్లపై తలకాయలు లేకుండా నడిపేవారు ఎక్కువయ్యారు: పోలీసులకు పెద్ద తలనొప్పి (Video)

సర్వాంగ సుందరంగా ముస్తాబైన క్యాపిటల్ రోటుండా : మరికొన్ని గంటల్లో అధ్యక్ష పీఠంపై ట్రంప్...

మరో జన్మవుంటే తెలుగువాడిగానే పుట్టాలనివుంది : సీఎం చంద్రబాబు

బతకాలంటే భయమేస్తుంది... క్షమించండి మమ్మీడాడీ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

తర్వాతి కథనం
Show comments