Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా క్రికెటర్లు అందంగా వుండరు.. పిస్ డ్రింకర్స్.. ఐసీసీ ఫైర్

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (15:40 IST)
మహిళల ఐపీఎల్‌కు ట్రయల్ టోర్నీగా నిర్వహిస్తున్న ఉమెన్ టీ20 చాలెంజ్ ఫైనల్‌కు వచ్చేసింది. మూడు మ్యాచ్‌లలో భాగంగా మొదలైన టోర్నీలో రెండు మ్యాచ్‌లు ముగియడంతో మిథాలీ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. 
 
జైపూర్ వేదికగా గురువారం రాత్రి వెలాసిటీ వర్సెస్ సూపర్ నోవాస్ మ్యాచ్‌లో మిథాలీ సేన 12 పరుగుల తేడాతో గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీంతో హర్మన్ జట్టు ఫైనల్‌కి చేరుకుంది. నెట్ రన్ రేట్ లేకపోవడంతో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 
 
ఇకపోతే.. ఇటీవల ముగిసిన మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్‌ కెప్టెన్ స్మృతి మంధాన 67 బంతుల్లో 90పరుగులు చేసి సూపర్‌నోవాస్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. దీనిపై ఐసీసీ మందానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. 
 
ఆ ట్వీట్‌కు పాకిస్తాన్ అభిమాని ఒకరు భారతీయులను పిస్ డ్రింకర్స్ అంటూ సంబోధించాడు. అంతటితో ఆగకుండా మహిళా క్రికెటర్లు అందంగా ఉండరు అంటూ వాళ్లను చూస్తే ఏ మాత్రం వినోదం రాదని అందుకే మహిళా క్రికెట్ చూడమని ట్వీట్ చేశాడు. 
 
దానికి స్పందించిన ఐసీసీ ట్విట్టర్ ద్వారా.. ''ఇది 2019. నువ్వు ఇంకా ఎదగాలి. బై.." అంటూ బ్లాక్ చేసినట్లు హ్యాష్ ట్యాగ్‌ను జత చేస్తూ పోస్టు చేసింది. మహిళా క్రికెటర్లకు మద్దతుగా నిలిచినందుకు ఐసీసీని ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments