Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపై గెలిస్తే... ముంబైతో ఫైనల్ సమరం.. చెన్నైకింగ్స్‌కు అదృష్టం కలిసొస్తుందా? (video)

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (12:23 IST)
రెండే నిమిషాల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఆదివారం హైదరాబాదులో జరుగనున్న ఐపీఎల్ ఫైనల్ పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం రెండంటే రెండే నిమిషాల్లోనే అన్నీ టిక్కెట్లను కొనుగోలు చేసేశారు. అదీ ఆన్‌లైన్‌లో ఐపీఎల్ ఫైనల్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 
 
ఐపీఎల్ లీగ్ పోటీలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ప్లే ఆఫ్ పోటీ జరుగనుంది. ఈ పోటీలో గెలిచే జట్టు ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ పోటీకి సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో శరవేగంగా అమ్ముడుపోయాయి. దీంతో టిక్కెట్లు పొందలేని క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. 
 
ఇకపోతే.. ఒక నెలపాటు జరుగుతున్న ఐపీఎల్ పోటీలు క్లైమాక్స్‌కు వచ్చేశాయి. ఐపీఎల్ ఉత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై-ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తేనే ముంబైతో ఫైనల్లో తలపడే అవకాశాన్ని చేజిక్కించుకుంటుంది. లేకుంటే ఇంటికి పోవాల్సిందే. చెన్నైకి ధోనీ వుండటం ప్లస్ అయినా.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు చేతులెత్తేయడం కలిసిరాలేదు. 
 
ఇప్పటి వరకు చెన్నై కింగ్స్- ఢిల్లీ జట్లు 19 సార్లు ఐపీఎల్‌లో తలపడ్డాయి. ఇందులో 13 మ్యాచ్‌ల్లో చెన్నై గెలుపును నమోదు చేసుకోగా, ఢిల్లీ ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాన్ని సాధించుకుంది. అయినా ఐపీఎల్‌లో ఆటకు అదృష్టం కూడా తోడవ్వాలి. మరి ఈసారి ప్లేఆఫ్‌లో అదృష్టం చెన్నైకి దక్కుతుందా.. లేకుంటే ఢిల్లీకి దక్కుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments