Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IIT Madras అలా చెప్పిందని ధోనీ ఇలా చేశాడా? అదే దెబ్బ కొట్టిందా?

Advertiesment
IIT Madras అలా చెప్పిందని ధోనీ ఇలా చేశాడా? అదే దెబ్బ కొట్టిందా?
, బుధవారం, 8 మే 2019 (17:26 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ గురించి ఐఐటీ మద్రాస్ ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్న-దానికి సమాధానం మరోసారి చర్చలోకి వచ్చింది. నిన్న జరిగిన మ్యాచ్‌కి సంబంధించి ధోనీ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవాలా? బ్యాటింగ్ ఎంచుకోవాలా? అంటూ ప్రశ్న అడిగారు. దీనికి వివరణ కూడా ఇచ్చారు. పిచ్ పరిస్థితులను తెలిపారు. రాత్రిపూట పిచ్ పైన తేమ అధికంగా వుంటుంది కనుక ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా, ఫీల్డింగ్ బెటరా అని అడిగారు. దానికి విద్యార్థుల నుంచి రకరకాల సమాధానాలు వచ్చాయి. 
 
ఐతే సమాధానం మాత్రం టాస్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ పీల్డింగ్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే, రాత్రివేళ గాలిలో తేమ అధికంగా వుంటుంది కనుక బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వుంటుంది. వాళ్లు అనుకున్నట్లుగా బంతులు పడకపోవచ్చు. ఫలితంగా జట్టు విజయావకాశాలు తక్కువ. ఇదీ సమాధానం.
 
కానీ నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దానితో వెంటవెంటనే వికెట్లు పడిపోవడం, ఆ తర్వాత స్వల్పస్కోరు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో లక్ష్య చేధన ఒత్తిడి తీసుకువస్తుందన్న కారణంగా ధోనీ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 
 
కానీ ఐఐటి మద్రాస్ అంచనా వేసినట్లుగానే తదుపరి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ కు చేరుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... చెన్నై చెపాక్ స్టేడియంలో ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ప్రతిసారీ విజయం సాధించారు. మరి... నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకుని అపజయం పాలయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యాచ్ అన్నాక ఎవరో ఒకరు ఓడాలిగా.. పిచ్‌ను అర్థం చేసుకోలేకపోయాం: ధోనీ