Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్ మిషీన్ రికార్డును బద్ధలు కొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (16:51 IST)
ఆధునిక క్రికెట్‌లో పరుగుల యంత్రంగా గుర్తింపు పొందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్. ఈ మధ్య కాలంలో క్రికెట్‌లో ఏ రికార్డు బద్దలుకొట్టాలన్నా అది కోహ్లీకే సాధ్యంగా మారింది. ఈ రన్‌మెషీన్ అంతటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 
 
అలాంటి కోహ్లీ రికార్డును బద్ధలు కొట్టారు. ఆ క్రికెటర్ పేరు హషీమ్ ఆమ్లా. సౌతాఫ్రికా ఓపెనర్. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆమ్లా.. విరాట్‌ను వెనక్కి నెట్టాడు. వన్డేల్లో వేగంగా 27 సెంచరీల మార్క్ అందుకున్న ప్లేయర్‌గా అతడు నిలిచాడు. 
 
కోహ్లి 169 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ అందుకోగా.. ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లోనే 27 సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి కంటే ముందు సచిన్ (254 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉంది. 2017, జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. రెండేళ్ల కిందటి కోహ్లి రికార్డును ఇప్పుడు ఆమ్లా తిరగరాశాడు. అయితే ఈ రికార్డు సెంచరీ కూడా సౌతాఫ్రికాను గెలిపించలేకపోయింది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments