ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మంగళవారం నుంచి అర్థకుంభమేళ సంబరాలు మొదలుకానున్నాయి. అయితే, ఈ వేడుకల ప్రారంభానికి ఒక్కరోజు ముందు అంటే సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
దీంతో వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపకదళ సిబ్బంది ఆగమేఘాలపై మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్డులు ఆహుతికి దగ్దమయ్యాయి. అయితే, ఫైర్ సిబ్బంది అప్రమత్తత వల్ల ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగలేదు.
కాగా, ఈ అర్థకుంభమేళాకు 192 దేశాల నుంచి సుమారుగా 12 కోట్ల మంది భక్తులు వస్తాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకు తగినట్టుగానే ఏర్పాటుచేసింది. ఈ కుంభమేళా కోసం తాత్కాలిక నగరాన్ని రూ.2800 కోట్లతో నిర్మించారు. ఈ నగర వ్యాప్తంగా వెయ్యి సీసీటీవీ కెమెరాలు, 20 మంది పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే, ఈ నగరమంతా రాత్రిపూట కూడా పట్టపగలుగా ఉండేలా 40 వేల ఎల్ఈడీ బల్బులను అమర్చారు.