పచ్చకర్పూరం తెల్లకర్పూరం కంటే చాలామంచిది. ఇది పలుకులుగా కొట్లో దొరుకుతుంది. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్ని, వెన్నను గానీ కలిపి తమలపాకుల్లో పెట్టి నమిలి రసాన్ని మింగితే శరీర వేడి వెంటనే తగ్గుతుంది. కళ్లుబైర్లు కమ్మడం, తలతిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చమటలు పట్టడం తగ్గిపోతాయి.
పచ్చకర్పూరాన్ని రోజుకు మూడుపూటలా ఒకటి, రెండు పలుకులు తీసుకుంటే.. బలం, రక్తపుష్టి కలుగుతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది. బి.పి.తగ్గుతుంది. కంటి జబ్బులు, రక్తస్రావాలు అరికడుతాయి. ఏమందు వాడుతున్నప్పుడైనా ఆమందులతోపాటు ఒక పలుకు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది. పచ్చకర్పూరం తీసుకుంటే.. వడదెబ్బ, దాహం, తపన, శరీరం చిటచిటలాడడం, శోష వంటివి తగ్గుతాయి.
కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు.. పచ్చకర్పూరాన్ని తీసుకుంటే.. కళ్లమంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్ళ వెంటనీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. బాగా పైత్యం చేసినవారు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటే.. పైత్య వికారాలన్నీ తగ్గిపోతాయి. వేడి చేయడం వలన కలిగే ఒళ్ళుమంటలు, అరికాళ్ళు, అరిచేతుల మంటలు మొదలైన వాటికి పచ్చ కర్పూరాన్ని గ్లాస్ పాలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
పచ్చకర్పూరం 5 గ్రాములు, జాజికాయ 5 గ్రా, జాపత్రి 5 గ్రా.. ఈ మూడింటిని మెత్తగా నూరి, అందులో 5 గ్రా ఎండుద్రాక్షవేసి మళ్లీ నూరి, దీన్ని శెనగగింజలంత మాత్రలుగా తయారుచేసుకోవాలి. ఇలా చేసిన వాటిని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర చొప్పున వేసుకుని, పాలు తాగుతుంటే.. వీర్యం వృద్ధి చెందుతుంది. లైంగికశక్తి పెరుగుతుంది.