Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా - కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!!

వరుణ్
గురువారం, 11 జులై 2024 (10:52 IST)
భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. టీమిండియాకు కొత్త కోచ్‌గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రయాణం కూడా ఈ టూర్ నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు టీమిండియాకు కెప్టెన్‌‍గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. 
 
జట్టుకు చెందిన సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌‍గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీలంకతో టీమిండియా జులై 27 నుంచి 30 వరకు 3 టీ20లు... ఆగస్టు 2 నుంచి 7 వరకు 3 వన్డేలను ఆడనుంది. 
 
ఇకపోతే, శ్రీలంకతో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం ఖాయమని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా బెర్తుల కోసం యువ ఆటగాళ్లు పోటీ పడుతుండడంతో, కేఎల్ రాహుల్‌‌కు ఆ ఫార్మాట్లో స్థానం కష్టమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

తర్వాతి కథనం
Show comments