Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంత్ - రాధిక సంగీత్‌‍ వేడుకలు : టీ20 వరల్డ్ కప్ హీరోలకు అపూర్వ స్వాగతం

Advertiesment
world cup heros

సెల్వి

, శనివారం, 6 జులై 2024 (19:21 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ - నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ విజేతలకు అరుదైన గౌరవం, అపూర్వ స్వాగతం లభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యను వేదికపై సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అక్కడున్న వారంతా చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఈ ముగ్గురూ ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యులు కావడం విశేషం.
 
ఇకపోతే, సంగీత్‌ వేడుకల్లో భాగంగా నీతా అంబానీ ఈ ముగ్గురు క్రికెటర్లను వేదికపైకి పిలిచారు. తొలుత రోహిత్‌ శర్మను, తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ను నీతా వేదికపైకి వరుసగా ఆహ్వానించారు. వారికి స్వాగతం పలికేటప్పుడు టీ20 ప్రపంచకప్‌లో వారి ఘనతలను ప్రస్తావించారు. వేదికపైకి వచ్చాక వారిని హత్తుకున్నారు. ఈ క్రమంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. 
 
హార్దిక్ పాండ్య గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. 'కఠిన సమయాలు నిరంతరం ఉండవు. కానీ, వాటికి ఎదురు నిలిచినవారే ముందుకు సాగగలరు' అంటూ పాండ్యపై వచ్చిన విమర్శలను ఉద్దేశించి అన్నారు. వేదికపైకి వచ్చిన తర్వాత ముఖేశ్‌ అంబానీ సైతం క్రికెటర్లను అభినందించారు. 2011 తర్వాత ప్రపంచకప్‌ను దేశానికి అందించి దేశం గర్వపడేలా చేశారంటూ కితాబిచ్చారు. అంతకుముందు జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో ముఖేశ్‌ అంబానీ కుటుంబ సభ్యులు ఆటాపాటలతో అలరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్ చక్కర్లు కొడుతున్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eina (@eina_isingh)


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువ క్రికెటర్లకు అరుదైన ఛాన్స్.. నేటి నుంచి జింబాబ్వేతో టీ20 క్రికెట్ సిరీస్!!