Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోహిత్ ఫోన్ కాల్‌ కారణంగానే ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా.. రాహుల్ ద్రవిడ్ (Video)

Advertiesment
rahul dravid

వరుణ్

, బుధవారం, 3 జులై 2024 (16:16 IST)
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో అతను కుదుర్చుకున్న ఒప్పంద కాలపరిమితి ముగిసిపోవడంతో ఆ బాధ్యతల నుంచి వైదొలగాడు. నిజానికి గత యేడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఈ మెగా ఈవెంట్‌లో తృటిలో టీమిండియా కప్పును చేజార్చుకుంది. దీంతో ఆ సమయంలోనే కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ద్రవిడ్ నిర్ణయం తీసుకున్నాడు. కానీ, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ద్రవిడ్ కోచ్‌గా కొనసాగాలని పట్టుబట్టి, ద్రవిడ్‌ను ఒప్పించాడు. 
 
ఈ విషయాన్ని తాజాగా ద్రవిడ్ వెల్లడించారు. గత యేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని చెప్పాడు. అప్పుడు రోహిత్ ఆపడం వల్లే ఈ రోజు టీ20 ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదించగలుగుతున్నానని, ఇందుకు తాను అతడికి కృతజ్ఞుడినని రాహుల్ వెల్లడించాడు. ప్రపంచకప్ విజయంతో కోచ్ పదవికి వీడ్కోలు పలికిన నేపథ్యంలో చివరగా టీమిండియా డ్రెస్సింగ్ రూంలో జట్టు సభ్యులనుద్దేశించి రాహుల్ మాట్లాడాడు.
 
'రోహిత్.. నవంబరులో నాకు ఫోన్ చేసి నన్ను కొనసాగమని అన్నందుకు ధన్యవాదాలు. భారత జట్టులోని ప్రతి సభ్యుడితో కలిసి పని చేయడం ఒక గౌరవం. కానీ నా కోసం ఎంతో సమయం వెచ్చించిన రోహిత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మేమిద్దరం ఎంతో మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు అభిప్రాయాలు కలిశాయి. కొన్నిసార్లు కలవలేదు. ఇక ప్రపంచకప్ విజయానుభూతులను జట్టులో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. పరుగులు, వికెట్లు కాదు.. అనుభూతులే ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఈ జట్టు చూపించిన పోరాటతత్వానికి, స్థిరత్వానికి నేను గర్విస్తా. 
 
గత కొన్నేళ్లలో కొన్ని విజయాలకు అత్యంత చేరువగా వెళ్లి విఫలం కావడం బాధ కలిగించింది. కానీ ఇప్పుడు ఆ గీత దాటాం. ప్రతి ఒక్కరూ ఈ విజయం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మీ భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యులు కూడా త్యాగాల్లో భాగమయ్యారు. ఇప్పుడు తిరిగెళ్లి వారితో సమయాన్ని ఆస్వాదించండి. నా పట్ల, నా బృందం పట్ల మీరంతా చూపించిన గౌరవం, ప్రేమాభిమానులకు కృతజ్ఞుడిని. ఒక గొప్ప జట్టు వెనుక విజయవంతమైన సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. బీసీసీఐ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి' అని ద్రవిడ్ అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ.. జాంగ్ బిజీ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.. (video)తర్వాత?