Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ క్రికెట్‌‍కు గుడ్‌బై చెప్పిన రవీంద్ర జడేజా!!

ravindra jadeja

వరుణ్

, ఆదివారం, 30 జూన్ 2024 (18:23 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్‌‍బై చెప్పేశారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు తమ టీ20 కెరీర్‌కు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. ఆదివారం మరో క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా టాటా చెప్పేశారు. తాజాగా భారత్ జట్టు సాధించిన 2024 టీ20 ప్రపంచ కప్‌లో జడేజా సభ్యుడిగా ఉన్న విషయం తెల్సిందే. 
 
2009లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటివరకు 74 టీ20 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేసి.. 54 వికెట్లు పడగొట్టాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన వెంటనే భారత స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
'నేను మనస్ఫూర్తిగా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఎల్లప్పుడూ నా దేశం కోసం నా శక్తిమేరకు అత్యుత్తమ ప్రదర్శన చేశా. ఇతర ఫార్మాట్‌లలో (వన్డేలు, టెస్టులు) కెరీర్‌ను కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవాలనే కల నిజమైంది. ఇది నా అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఉన్నతమైన శిఖరం. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు' అని జడేజా తన ఇన్‌స్టా ఖాతాలో వరల్డ్ కప్‌ ట్రోఫీని పట్టుకుని దిగిన ఫొటోని పోస్టు చేశాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రికెటర్లు వీరే..