Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొట్టి క్రికెట్‌‍కు కోహ్లీ - రోహిత్ శర్మ గుడ్‌బై!!?

Advertiesment
kohli - rohit sharma

వరుణ్

, ఆదివారం, 30 జూన్ 2024 (09:55 IST)
భారత క్రికెట్ జట్టుకు చెందిన ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఆ ఇద్దరు ఆటగాళ్లు ఇపుడు తమ క్రికెట్ కెరీర్‌‍కు స్వస్తి చెప్పారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ టోర్నీలో దేశానికి చివరి మ్యాచ్ ఆడేశామంటూ కామెంట్స్ చేశారు. వీరిద్దరూ ఒకేరోజు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. క్రికెట్ అభిమానులను సైతం కాస్తంత ఆశ్చర్యపరిచాయి. 
 
శనివారం జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్‌లో అద్భుత ఆటతీరుతో భారత్ విజయానికి బాటలు వేసి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న విరోట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాతి తరానికి చోటివ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఇదే తన చివరి ప్రపంచకప్ అని, మేం ఏం కోరుకున్నామో అది సాధించామని పేర్కొన్నాడు. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూసినట్టు చెప్పాడు. రోహిత్ 9 ప్రపంచ కప్‌లు ఆడాడని, తాను ఆరు ఆడానని గుర్తు చేశాడు. కోహ్లీ తన కెరియర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 4,188 పరుగులు చేశాడు. 
 
కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రోహిత్ శర్మ కూడా ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించాడు. బార్బడోస్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పొట్టి ఫార్మాట్ వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇంతకుమించి సరైన సందర్భం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు. ట్రోఫీ గెలవాలనుకున్నానని, గెలిచానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ 37 ఏళ్ల రోహిత్ శర్మ 159 మ్యాచ్లు ఆడి 4,231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్థ సెంచరీలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ ముద్దు.. వీడియో వైరల్