Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టు జర్నీ ఇలా...

Advertiesment
champions

వరుణ్

, ఆదివారం, 30 జూన్ 2024 (11:39 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత క్రికెజ్ జట్టు జర్నీ అద్భుతంగా సాగింది. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించారు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలమైనప్పటికీ తాను ముందుండి మ్యాచ్‌లను గెలిపించాడు. అయితే, కీలకమైన ఫైనల్ పోరులో మాత్రం శర్మ విఫలమయ్యాడు. కానీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఫలితంగా ఆదివారం జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తలపించిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024ను సగర్వంగా ఒడిసిపట్టింది. వెస్టిండీస్‌లోని బ్రిడ్జిటౌన్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేయగా... ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓ దశలో హెన్రిచ్ క్లాసెన్ భయపెట్టినా... హార్దిక్ పాండ్యా సమయోచితంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. క్లాసెన్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడమే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు.
 
మ్యాచ్ ఆఖరి ఓవరులో దక్షిణాఫ్రికా విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా... మరోసారి బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా... ఆ ఓవర్‌ను అద్భుతంగా విసిరి టీమిండియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ ఓవర్‌లో తొలి బంతికి మిల్లర్ భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుత రీతిలో పట్టిన క్యాచ్ మరో మేలిమలుపు అయింది. ఆ క్యాచ్‌ను వదిలి ఉంటే సిక్సర్ అయ్యేది. అదే ఓవర్లో రబాడా కూడా అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కథ దాదాపుగా ముగిసింది. మొత్తమ్మీద ఆ ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన పాండ్యా 8 పరుగులే ఇచ్చాడు.
 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ చూస్తే... ఓపెనర్ క్వింటన్ డికాక్ 39, ట్రిస్టాన్ స్టబ్స్ 31, డేవిడ్ మిల్లర్ 21 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, జస్రీత్ బుమ్రా 2, || అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. మధ్యలో బుమ్రా బౌలింగ్ చేసిన తీరు సూపర్బ్. కీలక దశలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. డాట్ బాల్స్ వేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాడు. మిగతా పనిని హార్దిక్ పాండ్యా పూర్తి చేశాడు.
 
అంతకుముందు, టీమిండియా ఇన్నింగ్స్‌లో కోహ్లీ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో పోరాడదగిన స్కోరు సాధించిందంటే అందుకు కారణం కోహ్లీ పట్టుదలే. కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 47, శివమ్ దూబే 27 పరుగులతో రాణించారు. ఎంతో విలువైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లికే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. 
 
ఇక, టీమిండియా చరిత్రలో ఇది రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్. 2007లో ధోనీ నాయకత్వంలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతలు అయ్యాక, మళ్లీ ఇన్నాళ్లకు మనవాళ్లు కప్‌ను గెలిచారు. 2014లో ఫైనల్స్ చేరినా అప్పుడు శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. ఓవరాల్‌గా చూస్తే ఇది భారత్‌కు నాలుగో ఐసీసీ కప్. 1983లో తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ చేజిక్కించుకున్న భారత జట్టు... ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఇప్పుడు 2024లో టీ20 వరల్డ్ కప్ ను సాధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్ట్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ధోనీ