Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హార్ట్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ధోనీ

ms dhoni

వరుణ్

, ఆదివారం, 30 జూన్ 2024 (10:17 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్‌లో భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. దీనిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించారు. ఈ మ్యాచ్ ఆఖరులో నా హార్ట్ బీట్ పెరిగిపోయింది అని అన్నారు. జట్టు టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత ధోనీ ఫస్ట్ రియాక్షన్ ఇది. ఫైనల్ సందర్భంగా ప్రశాంతంగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండడం, ఏం చేయాలో అది చేయడం కలిసొచ్చిందని, ప్రపంచకప్‌ను తెచ్చినందుకు స్వదేశంలోని భారతీయులతోపాటు విదేశాల్లోని భారతీయులందరి తరపున కతజ్ఞతలు తెలుపుకొంటున్నట్టు పేర్కొన్నాడు. అమూల్యమైన బర్త్ డే గిఫ్ట్‌లు.. ధన్యవాదాలు' అని ధోనీ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. 
 
అలాగే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. రెండు వన్డే ప్రపంచకప్‌ల, రెండు టీ20 ప్రపంచ కప్‌లతో భారత్ ఇప్పుడు 'ఫోర్ స్టార్' సాధించిందని పేర్కొన్నాడు. టీమిండియా జెర్సీపై చేరే ఒక్కో స్టార్ దేశంలోని చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతుందని, వారి కలలను చేరుకోవడానికి మరింత దగ్గర చేస్తుందని పేర్కొన్నాడు. 
 
11 యేళ్ల నిరీక్షణకు తెర... విశ్వవిజతగా టీమిండియా... 
 
భారత క్రికెట్ జట్టు విశ్వవేదికగా 11 యేళ్ల నిరీక్షణకు తెరపడింది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సేన విశ్వవిజేతగా నిలిచింది. దీంత 11 యేళ్ల నిరీక్షణకు తెరపడింది. భారత క్రికెట్ జట్టు ఐసీసీ ట్రోఫీని చివరిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2007 పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇపుడు 11 యేళ్ల తర్వాత రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా 2024 టీ20 ప్రపంచ కప్‌‌లో ప్రపంచ విజేతగా భారత్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో టీమ్‌ఇండియా గెలిచింది. విజేత భారత్‌కు, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కింది. సెమీస్‌లో నిష్క్రమించిన జట్లకూ ఐసీసీ ప్రైజ్‌మనీని అందించింది. 
 
ప్రైజ్‌మనీ వివరాలు (దాదాపు) ఇలా...
విజేత : భారత్‌కు రూ.20.50 కోట్లు 
రన్నరప్‌ : దక్షిణాఫ్రికాకు రూ.10.60 కోట్లు 
సెమీఫైనలిస్టులు : ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌కు చెరో రూ.6.50 కోట్లు 
సూపర్‌-8కు చేరిన 12 జట్లు : ఒక్కో టీమ్‌కు రూ.2 కోట్లు 
13 నుంచి 20వ స్థానంలోని ఒక్కో టీమ్‌కు రూ.1.90 కోట్లు 
ప్రతి జట్టు విజయం సాధించిన మ్యాచ్‌కు అదనంగా రూ.26 లక్షలు 
టీ20 ప్రపంచ కప్‌ ప్రైజ్‌మనీ మొత్తం విలువ రూ.93.80 కోట్లు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్టి క్రికెట్‌‍కు కోహ్లీ - రోహిత్ శర్మ గుడ్‌బై!!?