Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా కొట్టావేంటి పాండ్యా? 6-6-6 ఫార్ములా పూనకంతో మళ్లీ...

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (14:17 IST)
సిక్స్ కొట్టడమంటే సామాన్యం కాదు. కొంతమంది ఆటగాళ్లు చాలా సామాన్యంగా కనబడుతుంటారు కానీ కొట్టడం బిగిన్ చేస్తే అవతలి జట్టు చిత్తుచిత్తు అవాల్సిందే. న్యూజీలాండుతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ హ్యాట్రిక్ సిక్సర్లు 6-6-6 తో మెరుపులు మెరిపించాడు. ఇలాంటి ఫీట్లు ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చూపించాడు. కాకపోతే అప్పుడు పాకిస్థాన్ స్పిన్నర్లపై రెండుసార్లు హ్యాట్రిక్ సిక్సర్లతో విజృంభించాడు. 
 
ఇక తాజాగా చూస్తే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో 22 బంతుల్లోనే 2x4, 5x6 ఉతికి 45 పరుగులు పిండేశాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ ఆస్లే వేసిన 47వ ఓవర్‌లో మొదటి బంతికి పరుగు తీయని పాండ్యా ఆ తర్వాత వరుసగా మూడు బంతులను 6-6-6గా మలిచాడు. 
 
ఇలా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం పాండ్యా కెరీర్లో సాధారణంగా మారింది. అందుకే పాండ్యా వస్తున్నాడంటే అవతలి జట్టువారు పోసుకుంటారు అంతే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments