Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2023 : ముంబై ఇండియన్స్ ముంగిట భారీ టార్గెట్

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (21:46 IST)
ఐపీఎల్ 2023 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ - ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు సాహు కేవలం నాలుగు పరుగులు చేసి ఔటైనప్పటికీ మరో ఓపెనర్ శుభమన్ గిల్ 56 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 13, విజయ్ శంకర్ 19, డేవిడ్ మిల్లర్ 46, అభినవ్ మనోబర్ 42, రాహుల్ తెవాటియ 20 (నాటౌట్), రషీద్ ఖాన్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 
 
ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అర్జున్ టెండూల్కర్ రెండు ఓవర్లు వేసి 9 పరుగులు ఇవ్వగా, కెమెరాన్ గ్రీన్ రెండు ఓవర్లు వేసి 39 పరుగులు సమర్పించుకున్నాడు. జాసన్, రైలీ మెరెడిత్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయలు ఒక్కో వికెట్ చొప్పున తీయగా పియూష్ చావ్లా రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 208 పరుగులు లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు వికెట్ నష్టానికి 2.3 ఓవర్లలో 4 పరుగులు చేసింది. ఓపెనర్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగుల వద్ద బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments